మొగళ్లూరు ఎంపీటీసీ పోరులో హోరాహోరీగా తలపడుతున్న తోడికోడళ్లు

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మొగళ్లూరు ఎంపీటీసీ స్థానంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా కూకట్ల శంకరమ్మ, వైసీపీ అభ్యర్థిగా ఆమె తోడికోడలు కూకట్ల ఉష బరిలో నిలిచారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండటంతో మొగళ్లూరు ఎన్నిక స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.