తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిన మంత్రి సీతక్క

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

ఎల్నినో ప్రభావంతో తలెత్తే తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సింగూరు నీటి అవసరాల నిమిత్తం నూట ఇరవై కోట్లు, ఇతర జిల్లాలకు తక్షణ అవసరాల కోసం కోటి రూపాయల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు.