భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్న గణేశుని నవరోజుల పూజలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ రాజా వీధిలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు వినాయకునికి కుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. కుమార్ శర్మ ఈ పూజా కార్యక్రమం నిర్వహించగా, బండి శ్రీనివాసులు అలేఖ్య దంపతులు యజమానులుగా వ్యవహరించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్దఎన్న సంఖ్యలో పాల్గొని వినాయక దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.