కూతురు ఆరాధ్య కారణంగా కొత్త సంగీతాన్ని ఆస్వాదిస్తున్నానన్న అభిషేక్ బచ్చన్

రిపోర్టర్: రాము స్థలం: Mumbai

తన కూతురు ఆరాధ్య బచ్చన్ కారణంగా టేలర్ స్విఫ్ట్, అరియానా గ్రాండే వంటి ఆధునిక సంగీతాన్ని వింటున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు కిశోర్ కుమార్ పాటలు ఎంతో ఇష్టమని, అయితే పద్నాలుగేళ్ల కూతురు అభిరుచి మేరకు విదేశాల్లో జరిగిన సంగీత కచేరీకి కూడా వెళ్లానని తెలిపారు. చిన్నపిల్లల సంగీతాన్ని పెద్దలు తక్కువగా అంచనా వేయకూడదని ఆయన పేర్కొన్నారు.