'భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎత్తివేత': ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రిపోర్టర్: మహేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అక్రమాలు తేలిన 3.63 లక్షల ఎకరాలపై నిషేధాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే, కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులు మరియు సమగ్ర మార్గదర్శకాల ఆధారంగా 1.36 లక్షల ఎకరాల గ్రామ సేవా ఇనాం భూములతో సహా అర్హత ఉన్న భూములపై నిషేధాన్ని తొలగించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు పెద్దఎత్తున లబ్ధి చేకూరనుంది.