క్రీడా వస్తువుల తయారీకి కేంద్ర కేబినెట్ ఆమోదం: రూ.1,856 కోట్ల కేటాయింపు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

దేశీయంగా క్రీడా వస్తువుల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఖేలో ఇండియా స్పోర్ట్స్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి G Kishan Reddy వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద రూ.1,856.67 కోట్ల భారీ నిధులను కేటాయించినట్లు స్పష్టం చేస్తూ, మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.