కేంద్ర మంత్రి పదవికి ఎల్. మురుగన్ రాజీనామా: మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర మంత్రి పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వానికి డాక్టర్ ఎల్. మురుగన్ హఠాత్తుగా రాజీనామా చేశారు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకే తాను ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు కల్పించడం గొప్ప గౌరవమని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ ఆర్గనైజేషన్కు పూర్తి సమయం కేటాయిస్తానని మురుగన్ తేల్చిచెప్పారు.