'ఆస్తి రాసిస్తే ఇంటినుంచి గెంటేసారు': కుషాయిగూడలో కన్నతల్లి నిరసన
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని కుషాయిగూడలో ఆస్తిని తమ పేరున రాయించుకున్న కుమార్తెలు కన్నతల్లి వెంకటమ్మను ఇంట్లోంచి గెంటేయడంతో ఆమె న్యాయం కోసం ఇంటి ఎదుటే బైఠాయించి నిరసనకు దిగింది. భర్త, కుమారుడు మరణించడంతో ఒంటరియైన వెంకటమ్మ తనకున్న ఆస్తిని కూతుళ్లకు రాసివ్వగా, వారు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ బయటకు తోసేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుమార్తెలకు కౌన్సెలింగ్ నిర్వహించి, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టం ప్రకారం కేసును కీసర ఆర్డీవోకు రిఫర్ చేశారు.