అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర ఆదేశం

రిపోర్టర్: రాము స్థలం: ఖమ్మం

ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, వేగవంతంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో శనివారం జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ తీరును పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించవద్దని, ప్రభుత్వ ధ్యేయానికి అనుగుణంగా సిబ్బంది సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ హితవు పలికారు.