పాఠశాలలో విషాదం: గుండెపోటుతో తొమ్మిదేళ్ల చిన్నారి దుర్మరణం

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

ఢిల్లీలోని ఓ పాఠశాలలో ఆటల గంట ముగించుకుని తరగతి గదికి తిరిగొచ్చిన తొమ్మిదేళ్ల చిన్నారి హఠాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందిందని పాఠశాల ప్రిన్సిపల్ భావన మాలిక్ తెలిపారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని విద్యార్థిని అకస్మాత్తుగా మరణించడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తక్షణ వైద్యం అందకపోవడంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.