కొడంగల్ అభివృద్ధికి పెద్దపీట: రూ.3,295 కోట్లతో రేడియల్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం
రిపోర్టర్: గోపి
స్థలం: వికారాబాద్
కొడంగల్ నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేడియల్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసిందని అధికారులు తెలిపారు. రూ.3,295 కోట్ల భారీ అంచనా వ్యయంతో 81 కిలోమీటర్ల పొడవున ఈ ఆరు లేన్ల రహదారిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు స్థానిక యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.