అమెరికాలో వైభవంగా నవరాత్రి వేడుకలు: గర్బా నృత్యం చేసిన న్యూయార్క్ మేయర్
రిపోర్టర్: నరేష్
స్థలం: New York
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘనంగా జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో మేయర్ జోహ్రాన్ మామ్దాని ఉత్సాహంగా పాల్గొన్నారుని సోషల్ మీడియా వీడియోల ద్వారా వెల్లడైంది. హిందూ సమాజంతో కలిసి దుర్గాదేవి నవరాత్రులను జరుపుకున్న ఆయన, సాంప్రదాయ దుస్తులు ధరించి గర్బా నృత్యం చేయడంతో పాటు ఆలయ పూజారి నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ అవుతుండగా, ఆయన నివాళులు అర్పించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.