ఢిల్లీలో తీవ్ర కాలుష్యం: సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఢిల్లీ

దేశ రాజధాని ప్రాంతంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్ లో సగం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకావాలని, మిగిలిన వారు ఇంటి నుంచే పనిచేయాలని స్పష్టం చేశారు. నవంబర్ ఐదు నుంచి ఇరవై వరకు ఈ నిబంధన అమల్ లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.