'ధరణి, భూ భారతిపై విచారణకు మేం సిద్ధం.. నువ్వు సిద్ధమా?': రేవంత్‌రెడ్డికి హరీశ్ రావు సవాల్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
బీఆర్ఎస్ హయాంలోని ధరణి పోర్టల్, కాంగ్రెస్ ప్రభుత్వంలోని భూ భారతి వ్యవహారాలపై సిట్టింగ్ లేదా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సవాల్ విసిరారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టం చేస్తూ, రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించాలని నిలదీశారు. ఈ సవాల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.