బాబుల్గామా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారంతో హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు
రిపోర్టర్: సునీల్
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం బాబుల్గామా గ్రామంలో నెలకొన్న తాగునీటి కొరత తీరింది. కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్థుల సమస్యను సర్పంచి రవికుమార్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో అభినవ్ చందర్ ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో శనివారం బోరుబావి తవ్వించారు. సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేయగా, ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ రాచప్ప తదితరులు పాల్గొన్నారు.