ఫహాద్ ఫాజిల్ తెలుగు చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథి

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ తెలుగులో కథానాయకుడిగా నటిస్తున్న డాంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తుండగా, త్వరలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. ఫహాద్ ఫాజిల్ కెరీర్లో తొలిసారిగా నేరుగా నటిస్తున్న ఈ తెలుగు సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి.