కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన బోటు: నలుగురు మత్స్యకారుల మృతదేహాలు లభ్యం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Prakasam
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లి బోల్తా పడిన మత్స్యకార పడవ ఒడ్డుకు కొట్టుకురాగా, అందులో నాలుగు మృతదేహాలు లభ్యమైనట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన మిగిలిన మత్స్యకారుల కోసం మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.