కాంగ్రెస్ హామీలపై నిలదీత.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం

రిపోర్టర్: రమేష్ స్థలం: మెదక్

మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో కాంగ్రెస్ హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిని ఓ వ్యక్తి నిలదీశాడు. మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ.4000 పెన్షన్ ఏమైందని బాకీకార్డు చదువుతూ ప్రశ్నించాడు. ఈ వీడియో వైరల్ కాగా, ప్రశ్నించిన వ్యక్తిపై కాంగ్రెస్ నాయకులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది.