ఫ్రాంచైజీ లీగ్‌ల కంటే దేశానికే ప్రాధాన్యత ఇవ్వాలి: అర్జున్ రణతుంగ

రిపోర్టర్: విజయ్ స్థలం: మహారాష్ట్ర

యువ క్రికెటర్లు డబ్బు సంపాదన కోసమే ఫ్రాంచైజీ లీగ్ ల వైపు మొగ్గు చూపుతున్నారని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ ఆందోళన వ్యక్తం చేశారు. దేశం తరఫున ఆడటంలో ఉండే గర్వాన్ని యువ ఆటగాళ్లకు నేర్పించాలని ఆయన సూచించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో యువ క్రికెటర్లనుద్దేశించి మాట్లాడుతూ టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యతను, జాతీయ జెర్సీ పట్ల అంకితభావాన్ని ఆయన నొక్కిచెప్పారు.