కుప్పం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: చిత్తూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆదివారం బెంగళూరులో పర్యటించనున్న ఆయన, సోమవారం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లిలో జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. కుప్పం నియోజకవర్గంలో రూ.289.50 కోట్ల పనులను ప్రారంభించి, రూ.38.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. బహిరంగసభలో ప్రసంగించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడనున్నారు.