బిగ్ బాస్ హౌస్ లో కులుకుడు వివాదం: నాగార్జున వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో వంశీ వాడిన కులుకుడు పదంపై తీవ్ర వివాదం చెలరేగింది. హౌస్ లో కంటెస్టెంట్లను ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలపై హోస్ట్ నాగార్జున ఇచ్చిన వివరణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కులకడం అంటే తప్పు కాదంటూ నాగార్జున సమర్థించడంపై ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదానికి కొత్త అర్థం చెబుతున్నారంటూ నెటిజన్లు సైతం తమ నిరసనను వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.