ముంపు ప్రాంతాలను పరిశీలించి అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే బేబీనాయన

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు అలియాస్ బేబీనాయన పరిశీలించారు. పాతబొబ్బిలి మార్గంలో నిలిచిన వర్షపునీటి సమస్యను గుర్తించి, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గట్టులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు.