హైదరాబాద్లో ఘనంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ ప్రారంభం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్-2026ను ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏఐ విప్లవం కేవలం మోడల్స్కే పరిమితం కాకుండా చిప్స్, డేటా సెంటర్లు, సైబర్ భద్రత వంటి రంగాల్లో భారత్కు అపార అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. సాంకేతిక ఆవిష్కరణలకు తదుపరి తరం మౌలిక వసతులు ఇంధనంగా మారుతాయని చాప్టర్ చైర్పర్సన్ డాక్టర్ శ్రీదేవి దేవిరెడ్డి వెల్లడించారు. ఈ సదస్సుకు పారిశ్రామిక, సాంకేతిక రంగాల ప్రముఖులు హాజరయ్యారు.