పంజాబ్లో దారుణం: మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యకర్త పర్విందర్ సింగ్ జోటా కాల్చివేత
రిపోర్టర్: సతీష్
స్థలం: Mansa
పంజాబ్ రాష్ట్రంలోని మాన్సాలో మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యకర్త పర్విందర్ సింగ్ జోటా హత్యకు గురయ్యారని మాన్సా ఎస్ఎస్పీ వైభవ్ చౌదరి తెలిపారు. మెడికల్ షాపులో నిషేధిత మత్తు పదార్ధాల విక్రయంపై నిలదీసిన క్రమంలో జరిగిన ఘర్షణలో దుండగుడు ఆయన్ను కాల్చిచంపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆయన వెల్లడించారు.