థాయ్‌లాండ్ రాణి సుతిద సంచలనం: యుద్ధ విమానం నడిపి అరుదైన రికార్డు
రిపోర్టర్: సునీల్
స్థలం: Bangkok
థాయ్‌లాండ్ రాణి సుతిద స్వీడన్ తయారీ గ్రిపెన్ యుద్ధ విమానాన్ని తొలిసారిగా విజయవంతంగా ఒంటరిగా నడిపినట్లు రాయ్ థాయ్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. సురత్ తాని ప్రావిన్స్‌లోని వింగ్ సెవెన్ ఎయిర్ బేస్‌లో అక్టోబర్ 8న ఈ మైలురాయిని ఆమె సాధించారని, భర్త రాజు మహా వజ్రాలాంగ్‌కోర్న్ సమక్షంలో ఈ సాహసం చేశారని అధికారులు వెల్లడించారు. మాజీ ఫ్లైట్ అటెండెంట్ అయిన సుతిద, సైనిక విమానయానంలో విశేష అనుభవం సంపాదించి ఈ ఘనత సాధించడం విశేషం.