'కఠిన చర్యలు తీసుకుంటాం': కిష్త్వార్‌లో మదర్సా ఉపాధ్యాయుడి దాడులపై పంకజ్ కుమార్ ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: జమ్ముకశ్మీర్

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మదర్సాలో తొమ్మిదేళ్ల బాలుడిని ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. భయంతో బాలుడు అక్కడి నుంచి పారిపోయి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఒంటరిగా తిరుగుతుండగా స్థానికులు గమనించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు. బాలుడిని రక్షించి వైద్య సహాయం అందించిన అధికారులు, ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు చేపడతామని డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ స్పష్టం చేశారు.