జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి బలాన్ని నిరూపించుకోవాలి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లిలో డీసీఎంఎస్ ఛైర్మన్ కోట్ని బాలాజీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ సీఎం రమేశ్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో అమర్నాథ్ గాజువాక నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవాలని సవాలు విసిరారు. 2019లో మంత్రిగా పనిచేసిన సమయంలో అనకాపల్లిలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.