తీవ్ర తుఫాను ముప్పు: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు తాత్కాలిక మూసివేత
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయవాడ
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గమ్మ ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం మహామండపం మార్గాన్ని ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి తెచ్చామని, భక్తులు అధికారులకు సహకరించి సురక్షితంగా దర్శనం చేసుకోవాలని ఈవో విజ్ఞప్తి చేశారు.