వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న నటి పూజితా పొన్నాడ

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

ప్రముఖ తెలుగు నటి పూజితా పొన్నాడ వినాయకుడి నిమజ్జన వేడుకల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ పవిత్ర వేడుకకు సంబంధించిన కొన్ని ప్రత్యేక ఫోటోలను ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మళ్లీ వచ్చే సంవత్సరం రావాలంటూ వినాయకుడిని భక్తితో వేడుకున్నట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.