నెల్లూరులో వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయం కోరిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు సుబేదార్ పేట బృందావనం ప్రాంతాలలో వైఎస్ఆర్సిపి నగర ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 61వ డివిజన్ అభ్యర్థి వేలూరు ఉమా మహేష్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నివాసాలు దుకాణాలను సందర్శించి కరపత్రాలు పంపిణీ చేశారు. గత ఐదు సంవత్సరాలలో మహేష్ సారధ్యంలో డివిజన్ ఎంతగానో అభివృద్ధి చెందిందని మళ్లీ వైసిపి అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.