తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న మురసు
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా బలపడిందని, ఇది నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు. ఈ తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్ లో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్ లోని పలు జిల్లాలను హైఅలర్ట్ లో ఉంచినట్లు ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.