వార్తకు అదిరిపడి వృద్ధ ఓటర్లకు వీల్ చైర్లు సమకూర్చిన అధికారులు
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వృద్ధ ఓటర్లు పడుతున్న ఇబ్బందులపై ఆల్ఫా న్యూస్ కథనం ప్రసారం చేసింది. ఈ కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధుల సౌకర్యార్థం వీల్ చైర్ లను ఏర్పాటు చేసి, వారికి సులభంగా ఓటు వేసేందుకు సహాయపడ్డారు. ఆల్ఫా న్యూస్ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మరోసారి నిబద్ధతను చాటుకుంది.