ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 20, 2026 వరకు పొడిగించారు. వరుస సెలవులు, ప్రజల విజ్ఞప్తుల మేరకు చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో ఈ గడువును పెంచినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.