డిఎల్ఎడ్ ప్రవేశాలు: స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసిన బీహార్ బోర్డు

రిపోర్టర్: సునీల్ స్థలం: బీహార్

రాష్ట్రంలోని ప్రైవేట్ డిఎల్ఎడ్ శిక్షణ సంస్థల్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ను విడుదల చేసినట్లు బీహార్ పాఠశాల పరీక్షా బోర్డు వెల్లడించింది. నవంబర్ రెండు నుంచి నవంబర్ నాలుగు వరకు దెరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.