హైదరాబాద్లో షాకింగ్ ఘటన: మటన్ బిర్యానీలో లభించిన మనిషి పన్ను

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ రెస్టారెంట్లో మటన్ మండీ బిర్యానీ తింటుండగా పుచ్చిపోయిన మనిషి పన్ను లభించడం తీవ్ర కలకలం రేపిందిని బాధితుడు తెలిపారు. ఆహారంలో మానవ పన్ను రావడంతో షాక్కు గురైన ఆయన యాజమాన్యాన్ని నిలదీయగా, వారు దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు దిగారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ నిహారిక రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి విచారణ జరుపుతున్నారు.