దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు సాధించే విజయానికి, సంకల్పానికి ఈ పండుగ ప్రతీక అని ఆయన అభివర్ణించారు. కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులతో కలిసి ఈసారీ దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్లు మోదీ వెల్లడించారు. దేశ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.