విజయనగరం ఉత్సవాలు: సిరిమాను సంబరానికి భారీ ఏర్పాట్లు చేసిన యంత్రాంగం

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

విజయనగరం పైడితల్లి అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారని ఈవో శిరీష తెలిపారు. తెల్లవారుజాము నుంచి ఆలయ క్యూ లైన్లలో బారులు తీరి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమాను సంబరం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.