రష్యాలో ఉత్కంఠభరితంగా పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం

రిపోర్టర్: శివ స్థలం: రష్యా

ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాలో తొలిసారిగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు కఠిన నిబంధనల మధ్య శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎన్నికల్లో స్టేట్ డూమాలోని మొత్తం 450 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో ఏకైక యుద్ధ వ్యతిరేక పార్టీ అయిన యాబ్లోకోను సుప్రీంకోర్టు జాతీయ పోటీ నుంచి అనర్హత వేయగా ప్రో-క్రెమ్లిన్ శక్తులు, యుద్ధ అనుభవజ్ఞులు బరిలో నిలిచారు. అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ జాతీయ ఐక్యతను ప్రదర్శించేలా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.