సోమశిల నిర్వాసితుల ఉపాధిలో అవినీతి: ఉద్యోగాల కోసం అధికారుల లంచాల డిమాండ్

రిపోర్టర్: హరి స్థలం: నెల్లూరు

సోమశిల ముంపు గ్రామాల నిర్వాసితులకు ఉద్యోగాల కల్పనలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన నిర్వాసితులకు పరిహారం అందక పోగా, ఉద్యోగాల కోసం లంచాలు ఇవ్వాలని అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. ముడుపులు చెల్లించని వారిని కార్యాలయం లోపలకు కూడా అనుమతించడం లేదని వాపోయారు. ఏళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా అధికారులు లంచాల పేరుతో తమను మోసం చేస్తున్నారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.