బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ల హీట్, షాలిని వర్సెస్ వర్షిని గొడవ!
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిబంధనల ఉల్లంఘన, పక్షపాతం, గ్రూప్ రాజకీయాలపై కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా నరేష్, షాలిని మధ్య వాదన తీవ్రమైంది. చివరకు వర్షిని, షాలిని మధ్య గొడవ దాదాపు భౌతిక దాడి వరకు వెళ్లడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది.