షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు: బాలీవుడ్ సూపర్‌స్టార్ కు దర్శకుడు అట్లీ శుభాకాంక్షలు
రిపోర్టర్: గోపి
స్థలం: Mumbai
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు అట్లీ సామాజిక మాధ్యమాల వేదికగా ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. షారుఖ్ ఖాన్ తనకు గురువు, మార్గదర్శి మరియు గొప్ప స్ఫూర్తి అని అట్లీ ప్రశంసించారు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం కింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. సినిమాతో పాటు జీవిత పాఠాలను నేర్పిన షారుఖ్ ఖాన్ కు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని అట్లీ తెలిపారు.