శంకరపట్నంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు: సరైన పత్రాలు లేని ది రెండు వాహనాల సీజ్

రిపోర్టర్: సతీష్ స్థలం: శంకరపట్నం

గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో శనివారం పోలీసులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు, సరైన ధ్రువ పత్రాలు లేని డెబ్బై రెండు వాహనాలను సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ తనిఖీల ద్వారా అక్రమ కార్యకలాపాలకు అంకుశం పడుతుందని ఏసీపీ స్పష్టం చేశారు.