నిజామాబాద్‌లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రామిసరీ నోట్ నిరసన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Nizamabad
నిజామాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రామిసరీ నోట్ రాసి నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, దివ్యాంగుల పింఛన్లు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని, బాకీ పడిన మొత్తం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.