నెస్లే ఇండియాపై మూడు కేసులు నమోదు చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
రిపోర్టర్: రాము
స్థలం: భారతదేశం
ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో నెస్లే ఇండియాపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మూడు కేసులు నమోదు చేసింది. ఇన్ఫాంట్ న్యూట్రిషన్ ఉత్పత్తులైన నాన్ ఎక్సెల్ ప్రో స్టేజ్ వన్, లాక్టోజెన్ ప్రో వన్ ఆన్‌లైన్ ప్రకటనలు, విక్రయాల ప్రోత్సాహంపై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బయోటిన్ మోతాదు నిర్దేశిత స్థాయికి తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని FSSAI స్పష్టం చేసింది.