రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
తెలంగాణలో బీసీ మరియు ఇతర వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని వచ్చే నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు గరిష్టంగా రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందనుండగా, అరవై నుండి ఎది శాతం వరకు భారీ సబ్సిడీ ఇవ్వనున్నారు. దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.