రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలను ఖండించిన కాంగ్రెస్ నేత రషీద్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Delhi
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆ పార్టీ నేత రషీద్ అల్వీ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో జరిగిన ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మహిళలను అవమానించారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రాహుల్ మాట్లాడుతుంటే అక్కడ వేలాది మంది మహిళలు నవ్వుతూ ఆయనను అభినందించారని, బీజేపీ విమర్శలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన తేల్చిచెప్పారు.