రాజోలులో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
రిపోర్టర్: K NAGA SRINU
స్థలం: రాజోలు
రాజోలు మండలం వ్యాప్తంగా శుక్రవారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన శ్రీకృష్ణుడి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యువత ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమాల్లో పాల్గొనడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణ నామస్మరణలు, భక్తుల సందడితో రాత్రి వరకు వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి.