పిఠాపురం ప్రగతికి మోదీ ప్రభుత్వం భారీ నిధులు కేటాయింపు

రిపోర్టర్: అశోక్ స్థలం: పిఠాపురం

పిఠాపురం నియోజకవర్గంలో రూ.1,500 కోట్ల భారీ అంచనా వ్యయంతో సమగ్ర అభివృద్ధి పనులకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాగునీరు, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు మత్స్యకారుల భద్రత, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వివిధ రంగాల్లో ఈ నిధులను వెచ్చిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యల ద్వారా పిఠాపురం ప్రాంతం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు.