సన్ ఆఫ్ కనకదుర్గమ్మ చిత్రం: అమ్మవారిగా నటి లయ పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

దసరా పండుగ సందర్భంగా ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, స్వప్న దత్ చేతుల మీదుగా సన్ ఆఫ్ కనకదుర్గమ్మ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ కనిపించే పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. రాగా మూవీస్, తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి దుర్గ ఫణిదర్ లంక దర్శకత్వం వహిస్తుండగా, లయ, అనురూప్ కటారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.