ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూముల రీ సర్వే తదితర రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అగ్రిస్టాక్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమన్వయంతో రైతుల సంక్షేమం కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు.